Dasara Holidays | ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నెల 24 వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ హాలీడేస్ ఉండనున్నాయి. అంటే విద్యార్థులకు మొత్తంగా 9 రోజులు ఇచ్చారు.
ఇక తెలంగాణలో ఇప్పటికే దసరా సెలవులను ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అంటే మొత్తంగా 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 4వ తేదీన స్కూల్స్ రీఓపెన్ అవుతాయి.