Tirumala | శనీశ్వరుడు శంఖు చక్రాలు పట్టుకుంటాడా.. అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే.. అలిపిరి వివాదంపై భూమన కరుణాకర్ రెడ్డి
Tirumala | తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేసి ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Tirumala | తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేసి ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమన టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదు.. శనీశ్వరుడి విగ్రహమని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వారి ఆరోపణలను భూమన కరుణాకర్ రెడ్డి తిప్పికొట్టారు.
తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని చెబితే.. నాపైనే కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. అలిపిరి పాదాల చెంత పడివున్న విగ్రహం శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అంటున్నారని, శిల్పి చెక్కి పడేశాడని నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వరుడి విగ్రహం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. శనీశ్వరుడు విల్లు, బాణం ధరిస్తాడని స్పష్టం చేశారు. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే అని తేల్చిచెప్పారు.
నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఖాసన ఆగ్రమ శాస్త్రం తెలియని వాళ్లు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే దైవానుగ్రహంతో బోర్డు సభ్యులం అయ్యామని చెప్పుకుంటున్నారని అన్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో తాను రెండుసార్లు చైర్మన్, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినప్పటికీ వాస్తవాలే చెబుతుంటానని స్పష్టం చేశారు. హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడినని తెలిపారు. కాబట్టి తనపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరూ నమ్మరని అన్నారు. రాజకీయాల కంటే కూడా తనకు హిందూ ధర్మ పరిరక్షణే ముఖ్యమని తెలిపారు. నేను నాయకుణ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

