Aircraft : సాధారణంగా విమానంలో ఏలోపం తలెత్తినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే విమానాల టేకాఫ్‌కు ముందు సుదీర్ఘ తనిఖీ ప్రక్రియ ఉంటుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి తనిఖీలు మరింత ఎక్కువయ్యాయి. ఏ చిన్న లోపం ఉన్నా టేకాఫ్‌కు ముందే విమానాలను నిలిపేస్తున్నారు. ఒకవేళ టేకాఫ్ అయిన తర్వాత సమస్యను గుర్తిస్తే వెంటనే తగుజాగ్రత్తలు తీసుకుని సేఫ్లాండ్ చేస్తున్నారు.
ఇవాళ కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జట్ విమానానికి కూడా పెనుముప్పు తప్పింది. కాండ్లా ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఆ విమానం బయటివైపు చక్రం ఊడిపోయి రన్‌వేపై కనిపించింది. దాంతో పైలట్‌ను అప్రమత్తం చేసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమనాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. శుక్రవారం మధ్యాహ్నం 15.51 గంటలకు విమానం సురక్షితంగా ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని స్పైస్‌జట్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.