Aircraft | విమానం టేకాఫ్.. రన్‌వేపై ఊడిన చక్రం.. తర్వాత ఏమైందంటే..!
Aircraft | సాధారణంగా విమానంలో ఏలోపం తలెత్తినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే విమానాల టేకాఫ్‌కు ముందు సుదీర్ఘ తనిఖీ ప్రక్రియ ఉంటుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి తనిఖీలు మరింత ఎక్కువయ్యాయి.
Aircraft : సాధారణంగా విమానంలో ఏలోపం తలెత్తినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే విమానాల టేకాఫ్‌కు ముందు సుదీర్ఘ తనిఖీ ప్రక్రియ ఉంటుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి తనిఖీలు మరింత ఎక్కువయ్యాయి. ఏ చిన్న లోపం ఉన్నా టేకాఫ్‌కు ముందే విమానాలను నిలిపేస్తున్నారు. ఒకవేళ టేకాఫ్ అయిన తర్వాత సమస్యను గుర్తిస్తే వెంటనే తగుజాగ్రత్తలు తీసుకుని సేఫ్లాండ్ చేస్తున్నారు.
ఇవాళ కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జట్ విమానానికి కూడా పెనుముప్పు తప్పింది. కాండ్లా ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఆ విమానం బయటివైపు చక్రం ఊడిపోయి రన్‌వేపై కనిపించింది. దాంతో పైలట్‌ను అప్రమత్తం చేసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమనాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. శుక్రవారం మధ్యాహ్నం 15.51 గంటలకు విమానం సురక్షితంగా ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని స్పైస్‌జట్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

