Supreme Court: సుప్రీంకోర్టులో సెల్ఫీలు, రీల్స్ ఇక కుదరదు.. హై సెక్యూర్టీ ఏరియాలో ఫోటోలు, వీడియోలు బ్యాన్
Supreme Court : సుప్రీంకోర్టులో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం విధించారు. హై సెక్యూర్టీ జోన్లో ఫోటోలు, వీడియోలు తీయడం ఇక చెల్లదు. ఒకవేళ ఎవరైనా ఈ నియమావళి ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
న్యూఢిల్లీ: ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై సుప్రీంకోర్టు(Supreme Court)లో నిషేధం విధించారు. హై సెక్యూర్టీ జోన్లో ఫోటోలు, వీడియోలు తీయడం ఇక చెల్లదు. ఒకవేళ ఎవరైనా ఈ నియమావళి ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. శుక్రవారం కోర్టు సెక్రటరీ జనరల్ ఈ సర్క్యూలర్ జారీ చేశారు. ఆ ఆదేశాలు లాయర్లు, ఫిర్యాదుదారులు, ఇంటర్న్లు, న్యాయ క్లర్క్‌లు, స్టాఫ్, విజిటర్స్‌కు వర్తించనున్నాయి. కేవలం అధికార ప్రోగ్రామ్‌లకు మాత్రమే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుమతించనున్నారు.
కెమెరాలు, ట్రైపాడ్లు, సెల్పీ స్టిక్‌లు, మొబైల్ ఫోన్ల ద్వారా వీడియోలు, రీల్స్ చేయడాన్ని సుప్రీంకోర్టులో బ్యాన్ చేశారు. హై సెక్యూర్టీ జోన్లో ఉన్న లాన్ ఏరియా కూడా నిషేధం ప్రదేశం కిందకు వస్తుంది. మీడియా వ్యక్తులు కూడా తమ ఇంటర్వ్యూలు, లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లు.. నిర్దేశిత లో సెక్యూర్టీ జోన్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రిపోర్టర్ ఆ నియయావళి ఉల్లంఘిస్తే, అతనికి హై సెక్యూర్టీ జోన్లో నెల రోజుల పాటు నిషేధం విధించనున్నారు.
ఆదేశాలు ఉల్లంఘించే అడ్వకేట్లు, ఇంటర్న్లు, న్యాయ సిబ్బందిని సంబంధిత బార్ అసోసియేషన్లకు ఫిర్యాదు చేస్తారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. హై సెక్యూర్టీ జోన్లో ఎవరు ఫోటోలు, వీడియోలు తీసినా వారిని అడ్డుకునే అధికారం సెక్యూర్టీ సిబ్బందికి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

