పెన్‌పహాడ్, సెప్టెంబర్ 12 : పెన్‌పహాడ్ పరిధిలోని చిదెళ్ల పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి 400 బస్తాల యూరియా వచ్చిందని సమాచారం అందడంతో తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ సొసైటీ వద్దకు 3 వేల మంది రైతులు వరుస కట్టారు. తీరా ఒక్కొక్కరికీ ఒక బస్తాల చొప్పున పంపిణీ చేయడంతో దొరకని వారు అసహనానికి గురై ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి ఆందోళనను సద్దుమణిగేలా చేశారు.
అనంతారం గ్రామ రైతు సామ నరేశ్‌రెడ్డి తన ఆవేదనను తెలుపుతూ.. నాటేసి రెండు నెలలైంది. ఇంకా యూరియా ఎప్పుడొస్తదని ఎదురు చూస్తునే ఉన్నాం. 15 రోజుల కింద వేయాల్సిన యూరియా ఇప్పటికీ వేయలేదు. ఇప్పుడు గూడా ఒక్కటే లోడు వచ్చిందంటున్నరు. పొద్దుగాలటి నుంచి యూరియా బస్తాల కోసం నిలుచున్నం. మళ్లీ లోడు ఎప్పుడత్తదో, ఎప్పుడు ఇస్తరోనని తన ఆవేదన వెలిబుచ్చాడు.
Penpahad : పెన్‌పహాడ్‌లో యూరియా కోసం రైతుల ఎదురు చూపులు