Ritika Nayak | విశ్వక్సేన్ నటించిన అశోకవనంలో అర్జుణ కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రితికా నాయక్. ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తర్వాత నాని నటించిన హాయ్ నాన్నలో అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా తేజ సజ్జా హీరోగా నటించిన ఫాంటసీ డ్రామా మిరాయి సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంటోంది. కాగా రితికా నాయక్ మిరాయి ప్రమోషన్స్‌లో తనకు సిల్వర్ స్క్రీన్‌పై ఎవరితో రొమాన్స్ చేయాలనుందో చెప్పేసింది.
తాను అల్లు అర్జున్ను ఎంతో అభిమానిస్తానని చెప్పిన రితికా నాయక్.. నాకైతే అల్లు అర్జున్‌తో కలిసి నటించాలని ఉంది. సినిమా ఎలాంటిదైనా.. ఏ పాత్రైనా నాకు ఒకే.. అందులో నటించే అవకాశమొస్తే చాలని అంటూ తన మనసులో మాట చెప్పేసింది. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అప్పుడే సిల్వర్ స్క్రీన్‌పై అల్లు అర్జున్, రితికా నాయక్ కాంబోను ఊహించేసుకుంటున్నారు అభిమానులు, ఫాలోవర్లు. మరి రానున్న రోజుల్లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు సినీ జనాలు.
రితికా నాయక్ మరోవైపు రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో తెలుగు, తమిళ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ డ్యుయెట్ ఒకటి. కాగా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న VT15 కూడా ఈ భామ ఖాతాలో ఉంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Kanchana 4 | హార్రర్ ప్రాంచైజీ కాంచన 4 వచ్చేస్తుంది.. రాఘవా లారెన్స్ టీం క్రేజీ న్యూస్..!
Pawan Kalyan | తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ అవుతుంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్