Kanchana 4 | కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హార్రర్ ప్రాంచైజీల్లో టాప్‌లో ఉంటుంది కాంచన. రాఘవా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్స్‌లో నటించిన ఈ ప్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కాగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఓ వైపు వినోదం అందిస్తూనే.. మరోవైపు గూస్ బంప్స్ తెప్పించేందుకు కాంచన 4 కూడా వచ్చేస్తుంది. కోలీవుడ్ సర్కిల్ కథనం ప్రకారం కాంచన 4 చిత్రీకరణ సగభాగం పూర్తయింది.
రాఘవా లారెన్స్ టీం వీలైనంత త్వరగా కాంచన 4 ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రాఘవా లారెన్స్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కాంచన 4లో బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది నోరా ఫతేహి. పూజా హెగ్డే, రష్మిక మందన్నా కూడా కాంచన 4లో టీంతో జాయిన్ కాబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచన 3 మిక్స్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
కాంచన 3 తెలుగులో నాని నటించిన జెర్సీ చిత్రానికి బాక్సాఫీస్ వదదగట్టి పోటీనివ్వడమే కాదు సుమారు 100 కోట్ల వరకు వసూల్లు రాబట్టింది. మరి కాంచన 4 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Shah Rukh Khan | 1500 కుటుంబాలకు సాయం… మరోసారి గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్
Pawan Kalyan | తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ అవుతుంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్