Raaja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా భారీ సినిమాలతో బిజీగా మారిపోయిన ఆయన, ఇప్పుడు ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాజా సాబ్” సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు యాక్షన్, రొమాన్స్, ఫాంటసీ సినిమాల్లో అలరించిన ప్రభాస్, తన కెరీర్లో మొదటి సారి హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం తనకు ప్రత్యేక అనుభవంగా మారిందని ఆమె తాజాగా వెల్లడించింది.
ప్రభాస్ చాలా శాంతంగా ఉంటారు. ఆయన వయసు నాకంటే ఎక్కువే అయినా, ఆయనను చూస్తే అలానే అనిపించదు. సహజంగా ఉంటారు. ‘రాజా సాబ్’లో మా జంట చాలా బాగా వర్కౌట్ అయింది” అని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే పనిలో పనిగా మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. సినిమా కూడా పూర్తయ్యింది. కొన్ని పాటలను చిత్రీకరించాల్సి ఉందని పేర్కొంది ఈ బ్యూటీ. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ సరసన మాళవికతో పాటు నిధి అగర్వాల్ మరియు రిద్దీ కుమార్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లతో వస్తున్న ఈ ఫామిలీ ఎంటర్టైనర్లో ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉందని యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు థమన్.
ప్రభాస్ బర్త్‌డే (అక్టోబర్ 23) సందర్భంగా “రాజా సాబ్” నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతున్నట్లు బలమైన సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇది ప్రభాస్ అభిమానులకే కాదు, హారర్ ప్లస్ కామెడీ ప్రేక్షకులకూ ఓ వినోద విందుగా మారే అవకాశముంది. “రాజా సాబ్” ఓ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్‌గా మిగలబోతుందన్న మూడ్ అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.