Sanjay Guptha | నిర్మాతలు బాగుంటే సినీ ఇండస్ట్రీ బాగుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా విడుదలైన తర్వాత లాభనష్టాల సంగతి పక్కన పెడితే సినిమా నిర్మించడం మాత్రం నిర్మాతలకు ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మారుతున్న టెక్నాలజీకి, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తెరకెక్కించే నిర్మాతలకు నటీనటులు, ఇతర విషయాల్లో మాత్రం మెయింటైనెన్స్ పెరుగుతూనే ఉంటుంది. నటీనటుల కోసం సాధారణంగా ఇండస్ట్రీలో వ్యానిటీ వ్యాన్లుంటాయని కొత్తగా చెప్పనవసరం లేదు.
అయితే వ్యానిటీ వ్యాన్ల విషయంలో ప్రత్యేకించి కొందరు స్టార్లు డిమాండ్ చేసే తీరు నిర్మాతలకు తలనొప్పిగా మారుతుందన్నాడు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా. ఓ పోడ్కాస్ట్లో సంజయ్ గుప్తా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. కొందరు స్టార్ యాక్టర్లు సెట్స్‌లోకి ఆరు వ్యానిటీ వ్యాన్లలో వస్తారు. అయితే అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్లు మాత్రం తమ వ్యక్తిగత సిబ్బందికి అయ్యే బిల్లులను వారే భరిస్తారు. హృతిక్ రోషన్, బచ్చన్ కేవలం ఒక స్పాట్ బాయ్, ఒక మేకప్ ఆర్టిస్టును మాత్రమే పెట్టుకుంటారు. కానీ కొత్త యాక్టర్లు మాత్రం ఆరు వ్యానిటీ వ్యాన్లలో సెట్స్‌కు వస్తుంటారు. ఇది తాను చాలా సీరియస్‌గా చెబుతున్న విషయమన్నాడు సంజయ్ గుప్తా.
వ్యానిటీ వ్యాన్ల గురించి చెబుతూ.. ఓ స్టార్ అయితే తన వ్యక్తిగత అవసరాల కోసం మొదటి వ్యాన్‌ను వినియోగిస్తారు (అందులో దిగంబరంగా కూర్చుంటాడు). మరో వ్యాన్ మేకప్, హెయిర్ స్టైల్ కోసం వాడుతుంటారు. మూడో వ్యాన్‌ను మీటింగ్స్ కోసం.. నాలుగో వ్యాన్‌ను జిమ్ కోసం పెట్టుకుంటారు. జిమ్ వ్యాన్ అంటే జిమ్ మాత్రమే కాకుండా ట్రైనర్, అసిస్టెంట్, డ్రైవర్, మెయింటైనెన్స్ బాయ్ కూడా ఉంటాడు. ఈ స్టాఫ్‌కు ఆహారఅవసరాలు అదనమని చెప్పుకొచ్చాడు. ఇక కొందరు స్టార్లు చెఫ్‌లు పెట్టుకుంటారు. వీరికి అదనంగా మరో (ఐదవది)వ్యానిటీ వ్యాన్ కావాలి. పై అన్ని వ్యాన్ల కోసం పనిచేసే సిబ్బందికి షెల్టర్‌గా ఆరో వ్యానిటీ వ్యాన్‌ను పెట్టుకుంటారన్నాడు సంజయ్ గుప్తా.
ఇక ఓ స్టార్ కపుల్ అయితే ఏకంగా సెట్స్‌కు 11 వ్యానిటీ వ్యాన్లలో వస్తారు. వాళ్లిద్దరూ ఇంట్లో కలిసి భోజనం చేయరు. వాళ్లిద్దరూ భార్యభర్తలు అయినప్పటికీ వారికి విడివిడిగా కిచెన్ వ్యాన్స్ ఉండటం ఆశ్చర్యమేస్తుందన్నాడు సంజయ్ గుప్తా. ఇక ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయడంలో అమితాబ్ బచ్చన్‌పై ప్రశంసలు కురిపించాడు సంజయ్ గుప్తా. యాక్టర్లు ఆరు వ్యానిటీ వ్యాన్లను డిమాండ్ చేయడంపై రాకేశ్ రోషన్, ఫరా ఖాన్ గతంలో ఫిర్యాదులు కూడా చేశారని గుర్తు చేశాడు.
స్టార్ స్టేటస్‌లో మునిగిపోయే కొందరి నటీనటుల తీరు నిర్మాతలను ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తుందో తెలిపేలా సంజయ్ గుప్తా చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
Shah Rukh Khan | 1500 కుటుంబాలకు సాయం… మరోసారి గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్
Pawan Kalyan | తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ అవుతుంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్