వాషింగ్టన్: ఉగాది పండుగను పురస్కరించుకుని భారతీయులకు ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బేన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి అభినందనలు అని ఆమె ట్విట్టర్లో తెలిపారు. ఇందుకోసం ఒక వీడియోను తయారుచేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీడియో ప్రారంభంలో సంస్కృతంలో ఉన్న ఒక మంత్రాన్ని చదివి హిందీలో- ‘మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలుస అని చెప్పారు.
నటి, గాయని కూడా అయిన మేరీ మిల్బన్ వీడియో ద్వారా సంస్కృత మంత్రంతో ప్రారంభించి భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాన్ని పంపారు. మంత్రం పఠించిన తరువాత.. ప్రియమైన భారతీయులకు, భారతీయ సమాజంలో, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు నూతన సంవత్సరం సందర్భంగా అభినందనలు అంటూ చెప్పారు.
సాంప్రదాయ హిందూ పండుగల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. భారతీయ సంస్కృతితో నా సంబంధం మరింత బలపడుతున్నది. నేను భారతదేశం గురించి తెలుసుకున్నప్పుడు, ఈ దేశం పట్ల నా ప్రేమ పెరుగుతున్నదని వీడియోలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తన హిందీ గురువు డాక్టర్ మోక్స్రాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నేను భారతదేశం, భారతీయ సమాజం కోసం ప్రార్థించాను. భారతీయులందరూ సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాను అని మేరీ అన్నారు.
గత ఏడాది దీపావళి పర్వదినంతోపాటు భాతర స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా మేరీ మిల్బన్.. భారతీయులకు శుభాకాంక్షలు అందించారు. గత నవంబర్ నెలలో ‘ఓం జై జగదీష్ హరే అనే హారతి పాడి మన్ననలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజాని మల్బన్ వీడియో బాగా నచ్చింది.
Happy New Year to my beloved #India, the Indian-American community, and Indian communities across the world. Today, I hope you are blessed with the new spirit of the new year. May this new year bring much joy and happiness. My greeting: https://t.co/lSQjSYw7re.#HinduNewYear 🇺🇸🇮🇳
— Mary Millben (@MaryMillben) April 13, 2021
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
గ్రీన్ కార్డుల కోసం కేపిటల్ హిల్ వద్ద భారత వైద్యుల ఆందోళన
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
మధ్యప్రదేశ్లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..