Air India : ఎయిరిండియా (Air India) అంతర్జాతీయ సర్వీసులు అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఎయిరిండియా సీఈవో (Air India CEO) క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) బుధవారం వెల్లడించారు. అన్ని విమానాల్లో భద్రతా తనిఖీలు (Safety checks) పూర్తయ్యాయని, ప్రయాణికులకు ఇకపై ఎలాంటి ఆవాంతరాలు కలుగబోవనే పూర్తి విశ్వాసంతో అంతర్జాతీయ సర్వీసులను పునఃప్రారంభించబోతున్నామని క్యాంప్‌బెల్ తెలిపారు.
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 240 మంది మరణించారు. విమానంలో భద్రతాలోపంవల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. దాంతో విమానాల్లో భద్రతా తనిఖీల కోసం అంతర్జాతీయ సర్వీసులను నిలిపేశారు. తొలి దశలో భాగంగా ఆగస్టు 1 నుంచి కొన్ని సర్వీసులను పునరుద్ధరించారు. తొలిదశ పునరుద్ధరణ ప్రక్రియ సెప్టెంబర్ ఆఖరు వరకు పూర్తికానుంది. అక్టోబర్ 1 నుంచి మలిదశలో భాగంగా అంతర్జాతీయ సర్వీసులను పూర్థిస్థాయిలో పునరుద్ధరించనున్నారు.