Dharali : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం ఉత్తరకాశీ (Uttarakashi) జిల్లాలోని ధరాలీ (Dharali) గ్రామాన్ని మంగళవారం జలప్రళయం ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ జలప్రళయంలో ఇండ్లకు ఇండ్లే కొట్టుకుపోయాయి. ఆ ఇండ్ల స్థానంలో భారీగా బురద పేరుకుపోయింది. ప్రళయంలో ఇప్పటికే నలుగురు మరణించారు. దాదాపు 60 మంది గల్లంతయ్యారు. దాంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇండియన్ ఆర్మీ గాలిస్తోంది.
మంగళవారం క్లౌడ్బస్ట్ కారణంగా ఖీర్ గంగా నది ఉప్పొంగింది. దాంతో నది పక్కనే ఉన్న ధరాలీ గ్రామాన్ని వరద ముంచెత్తింది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఆ గ్రామంలో ఇళ్లకుఇళ్లే కొట్టుకుపోయాయి. పలు ఇళ్లను బురద కప్పేసింది. భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
ఈ విపత్తువల్ల ధరాలీ గ్రామానికి చెందిన దాదాపు 60 మంది గల్లంతయ్యారు. నలుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. బుధవారం కూడా రెస్క్యూ టీమ్స్ గాలింపులు కొనసాగిస్తున్నాయి.
#WATCH | Uttarakhand | Army personnel are conducting a search and rescue operation after a massive mudslide hit Dharali in Harsil pic.twitter.com/lkxLyOBBkX
— ANI (@ANI) August 6, 2025