Karnataka HC : జేడీయూ ఎంపీ (JDU MP), మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ (HD Deve Gouda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ను లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడేసేందుకు అతడి తండ్రి, జేడీయూ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ (HD Revanna) అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలంటూ కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) లో పిటిషన్ వేశాడు.
పని మనిషిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో హసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీస్‌స్టేషన్‌లో ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదైంది. దాంతోపాటు అతడిపై మరో మూడు లైంగిక వేధింపుల కేసులు కూడా నమోదయ్యాయి. వాటిలో ఒక కేసులో ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ప్రజ్వల్‌ను దోషిగా తేల్చింది. అతడికి జీవితఖైదు కూడా విధించింది. ఈ నేపథ్యంలో హోలెనరసిపుర పీఎస్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హెచ్డీ రేవణ్ణ హైకోర్టును ఆశ్రయించారు.