హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22 : హనుమకొండ బ్రాహ్మణవాడ చిన్న కోవెల గుడిలో వైశాఖశుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరాచార్యులు, భగవత్ రామనుజాచార్యులు జయంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ, వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి-నీలిమరెడ్డి దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చెరుకు నరసింహచార్యులు, శ్రీమాన్నారాయణచార్యులు, శ్రవణ్కుమార్చార్యులు, శ్రీధర్చార్యులు, స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం సుమారు 200 మంది బ్రాహ్మణ మహిళలు, వేద పండితులకు పట్టువస్త్రాలు, చీరలు కండువాలు పంపిణీ చేశారు.