హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి.రమేశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రమేశ్‌రెడ్డి ఈ పదవీలో నాలుగు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా పలు క్రీడాసంఘాల బాధ్యులు రమేశ్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.