Viral news | పక్కింటి భారత కుటుంబం నాకు పిచ్చిలేపుతోంది.. సోషల్ మీడియాలో ఓ అమెరికన్ ఆవేదన..!
Viral news | పక్కింటి భారత కుటుంబం (Inida family) తనకు పిచ్చిలేపుతోందని ఓ అమెరికన్ (American) సోషల్ మీడియా (Social Media) వేదికగా తన ఆవేదన వ్యక్తంచేశారు. తాను నైట్‌షిఫ్ట్ (Night Shift) లో పనిచేసి తెల్లవారుజామున పడుకుంటానని, ఆ తర్వాత కాసేపటికే భారత కుటుంబం లేచి గోలగోలగా మాట్లాడుతుందని, తనను సరిగా నిద్రపోనివ్వదని అతను తన అధికారిక రెడ్డిట్ (Reddit) హ్యాండిల్లో పోస్టు పెట్టాడు.
Viral news : పక్కింటి భారత కుటుంబం (Inida family) తనకు పిచ్చిలేపుతోందని ఓ అమెరికన్ (American) సోషల్ మీడియా (Social Media) వేదికగా తన ఆవేదన వ్యక్తంచేశారు. తాను నైట్‌షిఫ్ట్ (Night Shift) లో పనిచేసి తెల్లవారుజామున పడుకుంటానని, ఆ తర్వాత కాసేపటికే భారత కుటుంబం లేచి గోలగోలగా మాట్లాడుతుందని, తనను సరిగా నిద్రపోనివ్వదని అతను తన అధికారిక రెడ్డిట్ (Reddit) హ్యాండిల్లో పోస్టు పెట్టాడు. ఒకసారి తన పరిస్థితిని వివరించినా ఆ కుటుంబం లైట్ తీసుకుందని, పొద్దుపొద్దన్నే వచ్చే ఆ శబ్దాలు ఆగడం లేదని వాపోయారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొరుగింటి వారితో ఎలా ఉండాలనే విషయంలో నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లోని వెస్ట్ ఫ్రిస్కో ప్రాంతంలోగల స్టోన్బ్రూక్ పార్క్‌వే సమీపంలో బాధిత అమెరికన్ నివసిస్తుంటాడు. అతడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ కోసం ఇంటిదగ్గర నుంచే పనిచేస్తుంటాడు. తెల్లవారుజామున 2 గంటలకు అతను డ్యూటీ నుంచి లాగ్ ఆఫ్ అవుతాడు. మూడు గంటలకల్లా నిద్రపోతాడు. అయితే కేవలం రెండు గంటల తర్వాత అంటే ఉదయం 5 గంటలకు అతను పొరుగున ఉన్న భారత కుటుంబం నిద్రలేస్తుంది. లేవగానే ఆ కుటుంబంలోని వారు ఒకరితో ఒకరు గట్టిగా మాట్లాడుకుంటారు. అది ఆ అమెరికన్‌ను నిద్రపోకుండా చేస్తుంది. దాంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటాడు.
ఆ ఇబ్బంది గురించి అతడు సోషల్ మీడియాలో వివరించాడు. ‘నేను ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ కోసం ప్రతిరోజు రాత్రి 2 గంటల వరకు ఇంట్లోనే ఉద్యోగం చేస్తాను. మూడు గంటకల్లా నిద్రపోతాను. అయితే ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే, పక్కింటి భారతీయ కుటుంబం నిద్రలేచి ఇంటి బయట ఉంటుంది. మధ్యాహ్నం సమయం అన్నట్లుగా ఆ కుటుంబంలోని చాలామంది గట్టిగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నీళ్లు వస్తాయి. డ్రైవ్వే అంతటా బకెట్లతో నీళ్లు పోస్తారు. అవి అన్నిచోట్లా చిందుతాయి. ఆ తర్వాత గోడల నుంచి శబ్దం వచ్చేలా చీపుర్లతో ఊడుస్తారు. అనంతరం కబుర్లు చెప్పుకుంటూ, గొల్లున నవ్వుకుంటూ ఇంటి ముందు రంగు చాక్‌పీస్‌లతో గీతలు గీస్తారు. దాదాపు 10 నుంచి 20 నిమిషాలపాటు ఈ గీతలు గీసే కార్యక్రమం సాగుతుంది. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుంది. అలాగని రోజులో ఏదో ఒక సమయంలో డిస్టర్బెన్స్ ఉండదు. రోజంతా శబ్దాలు చేస్తూనే ఉంటారు’ అని సదరు అమెరికన్ రెడ్డిట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తంచేశాడు.
దీనిపై ఒకసారి తాను ఆ భారత కుటుంబంతో మాట్లాడానని, తన పరిస్థితిని వివరించానని.. అప్పుడు వాళ్లు సింపుల్‌గా నవ్వి ఊరుకున్నారని, ఆ తర్వాత శబ్దాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆ అమెరికన్ సోషల్ మీడియాలో వాపోయాడు. వారి డిస్టర్బెన్స్ పనిదినాలు, వారాంతాలు అనే తేడా లేకుండా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని తెలిపాడు. అయితే ఆ పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారడంతో రెడ్డిట్ నుంచి తొలగించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

