నిజాంపేట, అక్టోబర్10 : భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి దరఖాస్తు రూపంలో స్వీకరించిన భూ సమస్యలను సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన నిజాంపేట తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి సిబ్బంది రిజిస్టర్ల నిర్వాహణ, నిర్వహించే విధుల పట్ల దిశనిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు సైతం పరిష్కర మార్గం చూపాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు ప్రీతి, ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేశ్, సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Gold Rates | గోల్డ్ ప్రియులకు శుభవార్త.. కాస్త తగ్గిన బంగారం ధరలు.. రూ.2లక్షలకు చేరువలో వెండి
Ducks | రోడ్డుపైకి బాతుల గుంపు.. భారీ ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
Karwa Chauth | కోడలి కోసం అత్తగారి ప్రత్యేక వంటకం.. కర్వాచౌత్ విశేషాలు..