మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అవుట్ సోర్సింగ్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ( Technical Assistant ) గా పనిచేస్తున్న అధికారి లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) చిక్కాడు. ఆదిలాబాద్ అవినీతి నిరోదక శాఖ అధికారులు శనివారం కార్యాలయంపై దాడి చేసి టీఏ బానోత్ దుర్గాప్రసాద్‌ను పట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి( Kannepalli) మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఒకరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల కొట్టాన్ని నిర్మించుకున్నాడు. పెండింగ్ బిల్లు కోసం లబ్ధిదారుడు టీఏను సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. శనివారం రూ.10వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. టీఏను కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినామని , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు వివరించారు.