తాండూర్ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గెరిళ్ల పోరాటం చేసిన వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ( Konda Laxman Bapuji ) 110వ జయంతి జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా తాండూర్లో ఐబీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కులస్తులు, నాయకులు, ప్రముఖులు, ప్రజలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
కార్యక్రమం అనంతరం పద్మశాలీల ఆధ్వర్యంలో సంతలో అన్నదానం ( Annadanam ) నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మద్దికుంట రామచందర్, మామిడాల రాజేశం, రాంపల్లి ఈశ్వరయ్య, బంక వెంకటేష్ ,బండి లింగమూర్తి, వనమాల కైలాసం, జంజీరాల సురేష్, కామని శ్రీనివాస్, అనిల్, చంద్రశేఖర్, వాసాల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.