MLA Sunitha Lakshma Reddy | శివ్వంపేట, సెప్టెంబర్ 27 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన విధంగానే రాష్ట్రంలోని ప్రతీ మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం గోమారం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట మహిళా సంఘాల మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి మహిళకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రతి మహిళకు రూ. 1500 ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కాబట్టి అవి కూడా ఇవ్వాలని అన్నారు.
మెదక్ జిల్లాలో వర్షాలకు చెరువులు, కుంటలు అన్ని నిండుకున్నాయని.. కానీ ఇప్పటివరకు చేప పిల్లలను వదలడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత కేసీఆర్ హయాంలో ముందస్తు ప్రణాళికా బద్దంగా చెరువులలోకి నీరు రాగానే చేప పిల్లలు వదిలేదని.. దాంతో మత్స్యకారులు ఆర్థికంగా లాభాలు పొందిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో 5 కోట్ల 20 లక్షల చేప పిల్లలు వదులుతామని జిల్లా ఏడీ తెలిపారని.. కానీ ఇప్పటికీ టెండర్ వేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఏడీ చెప్పడం ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడమే కారణమన్నారు.
కనీసం బెస్త సంఘాలు డబ్బులు ఇవ్వండి చేప పిల్లలు మేము తెచ్చుకుంటాం అని అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. గత సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో చేప పిల్లలు వదిలితే చేపలు ఎదగక మత్స్యకారులు లాభాలు పొందలేకపోయారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చేప పిల్లలను వదలాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, వాకిటి హనుమంత్ రెడ్డి, వాకిటి బిక్షపతి రెడ్డి, కుంట లక్ష్మణ్, గంగిరెడ్డి నరసింహారెడ్డి, పెద్దపట్లోరి రామకృష్ణారెడ్డి, గడ్డం రాకేష్ రెడ్డి, కుంట నగేష్, కాముని నవీన్, పెద్దపట్లోరి యాదిరెడ్డి, గంగిరెడ్డి వీరారెడ్డి, బొంది లక్ష్మణ్ గౌడ్, ఇక్కిరి శ్రీశైలం గౌడ్ తదితరులు ఉన్నారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి