Rajvir Jawanda | ప్రముఖ పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వెంటనే ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పేందుకు వైద్యులు నిరాకరించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పలువురు గాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. సమాచారం మేరకు ఆయనకు ప్రమాదంలో తీవ్రమైన గాయ్యాయని సమాచారం. రాజ్వీర్ జవాండా హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డి ప్రాంతంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్వీర్ బైక్ నడుపుతుండగా అదుపు తప్పి పడిపోయినట్లుగా తెలుస్తున్నది.
ప్రమాదంలో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి.. ఆ తర్వాత మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తున్నది. బైక్‌పై ఆయన బడ్డి నుంచి సిమ్లాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. రాజ్వీర్ జవాండాకు పంజాబీలో మంచి సింగర్‌గా గుర్తింపు ఉంది. లూథియానా జిల్లాలోని జాగ్రోన్లో జన్మించిన జవాండా ‘కంగాని’ సాంగ్‌తో గుర్తింపు పొందారు. మేరా కి కసూర్, షౌకీన్, పాటియాలా షాహి పాగ్, సర్దారీ సాంగ్‌లతో ప్రజాదరణ పొందారు. జానపద పాటలు యువతలో ఆయనకు క్రేజ్‌ను తీసుకువచ్చాయి. 2018 సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.