Heart Stroke | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో విషాదం నెలకొంది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన ఓ బాలుడు ఆడుకుంటుండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు.. బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు అభయ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. దీంతో అభయ్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.