Team India | 2026 టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించారు. ఈ గ్లోబల్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. కానీ, మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకావొచ్చని అంచనా. ఈ టీ20 ప్రపంచకప్‌కు భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నివేదికల ప్రకారం.. బీసీసీఐ ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీకి ఇప్పటికే పంపింది. ఈ క్రమంలో భారత్ సైతం ఈ టోర్నీకి సిద్ధమైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని ఒకే జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. టైటిల్‌ను కాపాడుకునేందుకు 20 జట్ల మెగా టోర్నీలోకి అడుగుపెట్టనున్నది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత జట్టుకు టీ20 కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తున్నాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. జట్లు టోర్నీకి నెల ముందు తమ తుది 15 మంది సభ్యుల పేర్లతో జట్టు వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో అవసరమైన మార్పులకు అనుమతించడానికి సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటిస్తుంది. 2024లో వెస్టిండిస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచకప్‌లోనూ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టైటిల్ గెలిచిన సమయంలోనూ ఇదే నిబంధనలు వర్తించాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ జనవరి 21 నుంచి మొదలవుతుంది. ప్రపంచకప్‌కు ముందు టీ20 సిరీస్ భారత్‌కు సన్నాహకంగా ఉపయోగపడనున్నది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టీ20 మ్యాచులు నాగ్‌పూర్ (జనవరి 21), రాయ్‌పూర్ (జనవరి 23), గౌహతి (జనవరి 25), విశాఖపట్నం (జనవరి 28), త్రివేండ్రం (జనవరి 31)లో జరుగుతాయి. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు కేవలం 10 టీ20లు మాత్రమే ఆడుతుంది. ఈ క్రమంలో ప్లేయర్లు గాయలబారిన పడకపోతే జట్టులో పెద్దగా మార్పులు ఉండవని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.