Modi-Meloni | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని (Italian Prime Minister) జార్జియా మెలోనీ (Giorgia Meloni) మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. పలు అంతర్జాతీయ వేదికలపై వీరు ఇరువురూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ అందరినీ ఆకర్షిస్తుంటారు. తాజాగా వీరి మధ్య స్నేహబంధం మరోసారి నెటిజన్లను ఆకర్షిస్తోంది.
దక్షిణాఫ్రికాలో జీ20 వార్షిక సమావేశం (G20 summit) జరుగుతున్న విషయం తెలిసిందే. జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు ప్రపంచాధినేతలు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఉన్న మెలోనీని ప్రధాని మోదీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, ఇప్పటికే పలుసార్లు వీరిద్దరి ఫొటోలూ వైరల్ అయిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో కాప్28 సదస్సు జరిగిన సమయంలో కూడా వీరి సెల్ఫీ ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఏడాది జూన్‌లో కెనడాలో జరిగిన జీ7 సదస్సు సమయంలోనూ వీరి ఫొటో నెటిజన్లు ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి ‘మెలోడీ’ మూమెంట్ వైరల్ అవుతోంది.
#WATCH | Johannesburg, South Africa | Prime Minister Narendra Modi interacts with Italian Prime Minister Giorgia Meloni during the G-20 Summit
(Source: DD News) pic.twitter.com/a4DvBgOLmD
— ANI (@ANI) November 22, 2025
Also Read..
Delhi Air Pollution | ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. 50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
Amazon | అమెజాన్‌లో రికార్డు స్థాయిలో లేఆఫ్స్.. 40 శాతం టెకీల కోత..!
Droupadi Murmu | సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము