Amazon | ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గత నెలలో భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే, ఈ లేఆఫ్స్‌కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్స్ ప్రకారం.. ఆ రాష్ట్రాల్లో తొలగించిన 4,700 ఉద్యోగాల్లో దాదాపు 40 శాతం (1,800) ఇంజనీరింగ్ రోల్స్ (engineering positions)కు చెందినవే. ముఖ్యంగా మిడ్-లెవల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఉద్యోగుల తొలగింపుకు ఏఐ కారణం కాదని సంస్థ తెలిపింది. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో మరో రౌండ్ లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో లేఆఫ్స్ గుబులు మొదలైంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
Also Read..
Droupadi Murmu | సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా అధ్వానస్థాయిలోనే