Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Delhi Air Pollution) క్షీణించింది. శనివారం ఉదయం నగరంలో ఏక్యూఐ లెవెల్స్ 359 వద్ద నమోదైంది. చాలా ప్రాంతాల్లో పూర్ కేటగిరీలో గాలి నాణ్యత సూచిక నమోదైంది.
దీనికి తోడు నగరంపై దట్టమైన పొగ కమ్మేసింది. గాలి నాణ్యత క్షీణించడంతో రాజధానిలో ఆంక్షలు కఠినతరం చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఎన్సీఆర్ అంతటా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 50 శాతం మంది సిబ్బందికి ఇంటి నుంచి పని కల్పించాలని (work from home) సూచించింది. గాలి నాణ్యత క్షీణిస్తున్నందున వాహన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
శనివారం ఉదయం ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 422గా నమోదైంది. అశోక్ విహార్‌లో 403, బావన ప్రాంతంలో 419, జహన్గిర్పురిలో 417, రోహిణిలో 414, వివేక్ విహార్‌లో 423, నెహ్రూ నగర్లో 402, ఐటీవో ప్రాంతంలో 370, నోయిడా సెక్టార్ 125లో 434గా గాలి నాణ్యత నమోదైంది.
మరోవైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుబయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపేయాలని పాఠశాలలను ఆదేశించింది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ క్యాటగిరీకి చేరడంతో, సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ ఆదేశాలిచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, రికగ్నయిజ్డ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్‌కు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
Also Read..
Amazon | అమెజాన్‌లో రికార్డు స్థాయిలో లేఆఫ్స్.. 40 శాతం టెకీల కోత..!
Droupadi Murmu | సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
Mohan Bhagwat | హిందువులు లేకుండా ప్రపంచం ఉనికే లేదు : మోహన్ భగవత్