హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ మున్సిపల్ కార్మికుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్యను మున్సిపాలిటీ పరిధిలో లేని సింగరేణి ప్రాంతం కృష్ణ కాలనీలో చెట్లు నరికేందుకు అధికారులు పంపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అక్కడ చెట్లు నరుకుతూ ప్రాణాలు కోల్పోయాడు. సింగరేణి పరిధిలో ఎంతో మంది కార్మికులు ఉన్నా కూడా రాజయ్యను ఎందుకు పంపించారని, మృతికి గల కారణాలు చెప్పాలంటూ అతని మృతదేహంతో భూపాలపల్లి కలెక్టరేట్లో కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్లో ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు, మున్సిపల్ కార్మికుల పట్ల పోలీసులు విరుచుకుపడ్డారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. మహిళలను కూడా ఈడ్చుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చెట్లు నరుకుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు
మృతదేహంతో కలెక్టరేట్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్యను, మున్సిపాలిటీ పరిధిలో లేని సింగరేణి ప్రాంతం… pic.twitter.com/L8hB2RZnQK
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2025