Sripada Yellampalli Project | పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు 44,415 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 44,415 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి, ప్రస్తుత నీటినిల్వ 20.175 టీఎంసీలుగా ఉంది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలెవరూ కూడా నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని సూచించారు.