Sai Pallavi | తమిళనాడు ‘కలైమామణి’ పురస్కారం అందుకున్న సాయి పల్లవి, అనిరుధ్
Kalaimamani | స్టార్ నటి సాయి పల్లవి మరో అరుదైన ఘనతను అందుకుంది. కళారంగంలో విశేష కృషి చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం అందించే ‘కలైమామణి’ అవార్డును సాయి పల్లవి శనివారం అందుకుంది.
Kalaimamani | స్టార్ నటి సాయి పల్లవి మరో అరుదైన ఘనతను అందుకుంది. కళారంగంలో విశేష కృషి చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం అందించే ‘కలైమామణి’ అవార్డును సాయి పల్లవి శనివారం అందుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సాయి పల్లవికి ఈ అవార్డును అందజేశారు. తమిళనాడులోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డును 2021 సంవత్సరానికి గానూ సాయి పల్లవి అందుకోగా.. ఈ అవార్డులను తమిళనాడు ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాలకు కలిపి ప్రకటించింది. ఇందులో భాగంగా నటి సాయి పల్లవికి 2021 సంవత్సరానికి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కు 2023 సంవత్సరానికి ఈ పురస్కారం లభించింది. వీరే కాకుండా, దర్శకుడు-నటుడు ఎస్. జె. సూర్య, దర్శకుడు లింగుసామి, నటుడు విక్రమ్ ప్రభు, మరియు మణికందన్ వంటి ప్రముఖులు కూడా ఈ అవార్డును అందుకున్నారు. సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ కళా రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కళైమామణి అవార్డు గ్రహీతలకు మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేస్తారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

