Siddhu Jonnalagadda | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas)కు ఉన్న స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ టైటిల్ రోల్లో నటించిన కల్కి 2898 ఏడీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టిందో తెలిసిందే. అయితే బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్షి (Arshad Warsi) మాత్రం ఇవేమీ పట్టనట్టుగా కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ యాక్టింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయాడు.
తనకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని.. అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడన్న అర్షద్ వర్షి.. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ కామెంట్ చేయడంతో నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తాయి. అప్పట్లో ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తాజాగా టాలీవుడ్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ అర్సద్ వర్షీపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. కారణాల కంటే ఎమోషన్ వల్లే అలాంటి కామెంట్స్ వచ్చి ఉంటాయన్నాడు సిద్దు.
ఇది ఒక ఎమోషనల్ రియాక్షన్ అని నేను భావిస్తున్నా. అయితే ఆ తర్వాత ఆ కామెంట్స్ నాకు నచ్చలేదు. ప్రభాస్ అన్న పెద్ద స్టార్ యాక్టర్లలో ఒకరు.. నిజమైన డార్లింగ్. ఈ కామెంట్స్ విషయంలో నాకు కొంచెం ఇబ్బందిగా, బాధగా అనిపించింది. అందుకే అలా మాట్లాడానని చెప్పాడు. ప్రభాస్ కు మద్దతుగా నిలబడ్డ సిద్దు జొన్నలగడ్డ నిజాయితీ పట్ల అభిమానులు అందరూ ప్రశంసలు కురిపించారు. నొప్పింపక, తానొవ్వక అన్నట్టుగా కామెంట్స్‌పై సిద్ధు జొన్నలగడ్డ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట చాలా మంది హృదయాలను గెలుచుకుంటుంది.