ఇంట్లో ఎన్నెన్నో గాడ్జెట్స్ వాడుతుంటాం. దాంతో ఎప్పుడూ పవర్ సాకెట్స్ కొరత ఉంటుంది. ఒక్కో పరికరానికి ఒక్కోరకం ప్లగ్ అవసరం పడుతుంది. అలాంటి సమయంలో.. జీఎం కంపెనీ అందిస్తున్న ఈ 3 పిన్ 6 ఏఎంపీ యూనివర్సల్ మల్టీప్లగ్ ట్రావెల్ అడాప్టర్ మంచి ఆప్షన్. ఇది కేవలం ఇంటికే కాదు, ప్రయాణాలకు కూడా పర్ఫెక్ట్గా సూటవుతుంది. స్టూడెంట్స్‌కి, ఎప్పుడూ ప్రయాణాలు చేసేవారికి, ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, నైట్ ల్యాంపులు లాంటివన్నీ ఒకే దగ్గర కనెక్ట్ చేయాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూనివర్సల్ కనెక్టివిటీ దీంట్లో ప్రత్యేకత. ఇందులో రెండు ఇంటర్నేషనల్ సాకెట్స్ ఉంటాయి. అంటే.. విదేశాల నుంచి తెచ్చుకున్న ఫోన్ చార్జర్లు, కెమెరా చార్జర్లు లాంటివి కూడా దీనికి ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఈ అడాప్టర్‌లో ఇన్-బిల్ట్ సర్జ్ ప్రొటెక్టర్ ఉంది. వోల్టేజ్లో హెచ్చుతగ్గులు ఉన్నా.. మీ ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌కి ఎలాంటి డ్యామేజ్ కాదు. ఇది చాలా కాంపాక్ట్, లైట్‌వెయిట్ కూడా. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా వాడొచ్చు.
ధర: రూ. 250
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
ఇంట్లో ఒక ఎమర్జెన్సీ లైట్ కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే.. రాత్రిపూట కరెంటు పోయినా, ఏదైనా రిపేర్ చేయాల్సి వచ్చినా.. అది లేకుంటే కష్టంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో ఎమర్జెన్సీ లైట్ అనగానే ఎన్నెన్నో మోడల్స్ కనిపిస్తాయి. కానీ, వాటన్నిటిలో ఈ లైట్ వేరు. ఇదో రీచార్జబుల్ క్యాంపింగ్ ల్యాంప్. చూసేందుకు చిన్నదే అయినా, చేసే పనులు మాత్రం ఎన్నో! తక్కువ బడ్జెట్లోనే మన అవసరాలన్నిటినీ తీర్చేస్తుంది. ఈ వాటర్‌ప్రూఫ్ ఎల్ఈడీ టెంట్ లైట్ పాతకాలం నాటి వింటేజ్ డిజైన్‌లో ఉంటుంది. అవసరం కోసమే కాదు.. ఇంటి అలంకరణకూ వాడొచ్చు. టెంట్ లోపల్నో, ఇంటి హాల్లోనో దీన్ని హుక్‌కి తగిలిస్తే అద్భుతంగా కనిపిస్తుంది. దీంట్లో మూడు రకాల లైట్ మోడ్స్ ఉన్నాయి. తక్కువ కాంతితో వాడితే.. 8 గంటల వరకు, ఎక్కువ కాంతితో వాడితే.. 2 గంటల వరకూ పనిచేస్తుంది. దీని వార్మ్ లైట్ కాంతి కంటికి ఇబ్బంది కలిగించదు. దీనికి ఉన్న హుక్ డిజైన్ కారణంగా.. టెంట్‌కి, బ్యాగుకి, ఎక్కడైనా సులభంగా తగిలించుకోవచ్చు. ఇందులో ఇన్-బిల్ట్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంది. పదేపదే బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఉండదు. కేవలం 2 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. వాటర్-రెసిస్టెంట్ ఫీచర్ వల్ల, వర్షంలో, మంచులో ఉన్నా లైట్ పాడవ్వదు. కింద పడిపోయినా పగిలిపోకుండా, డ్యూరబుల్‌గా ఉంటుంది.
ధర: రూ. 600
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక స్క్రీన్ చూస్తూనే ఉంటున్నాం. కంప్యూటర్లో ఆఫీస్ పని, ఇంట్లో టీవీ, బయట మొబైల్.. దీంతో మన కళ్లు చాలా త్వరగా అలసిపోతున్నాయి. కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్లు ఎర్రబడటం, నొప్పి రావడం లాంటి సమస్యలు సర్వసాధారణమై పోయాయి. అలాంటి సమస్యలకు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే, తక్కువ బడ్జెట్లో మనకు మనమే ఇంట్లో ‘కూల్ ట్రీట్మెంట్’ ఇచ్చుకోవచ్చు. అదే బోల్డ్ హెల్త్ కూలింగ్ ఐ జెల్ మాస్క్. ఇది ఆల్-ఇన్-వన్ సొల్యూషన్! ఈ జెల్ మాస్క్‌ను కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి, ఆ తర్వాత కళ్లపై పెట్టుకుంటే చాలు. కళ్ల చుట్టూ ఉన్న చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా మారుతుంది. మైగ్రేన్ తలనొప్పి, సైనస్ నొప్పితోపాటు ఒత్తిడి నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. నిద్ర సరిగా లేక కళ్లు ఉబ్బినట్లు ఉన్నా, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని కళ్లు పొడిబారినా.. ఈ మాస్క్ గొప్ప పరిష్కారం చూపుతుంది. కొద్దిసేపు పెట్టుకుంటే చాలు.. కళ్లు చాలా రిలాక్స్ అవుతాయి.
ధర: రూ. 250
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
రెగ్యులర్‌గా వాడే పర్సుల బరువు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డబ్బులతోపాటు ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, ఆఫీస్ ఐడీలు, డ్రైవింగ్ లైసెన్స్.. ఇవన్నీ కలిపి పర్స్ ఓ రాయిలా తయారవుతుంది. దీంతో జేబు కూడా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ బరువును తగ్గించడానికి, కార్డులను సురక్షితంగా, స్టయిలిష్‌గా ఉంచుకోవడానికి.. ఒక స్మార్ట్ సొల్యూషన్ అవసరం. అదే స్టోరిట్ పీయూ లెదర్ 9 స్లాట్ కార్డ్ హోల్డర్. తక్కువ బడ్జెట్లో ఎవరైనా దీన్ని వాడేయొచ్చు. సన్నగా, స్టయిలిష్‌గా దీన్ని రూపొందించారు. సాధారణ పర్స్‌తో పోలిస్తే చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. పీయూ లెదర్‌తో తయారైన ఈ హోల్డర్.. చూసేందుకు చాలా క్లాస్‌గా కనిపిస్తుంది. ఈ చిన్న హోల్డర్‌లో ఏకంగా 9 కార్డుల వరకు పెట్టుకోవచ్చు. ప్రతి కార్డుకు వేర్వేరు స్లాట్స్ ఉండటం వలన, మీకు ఏ కార్డు కావాలన్నా వెంటనే తీసుకునే వీలుంటుంది. కార్డుల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. కార్డులతో పాటు, నాణేలు దాచుకోవడానికి వీలుగా, దీనికి జిప్ ఉన్న చిన్న పర్స్ ఉంటుంది. కొంత క్యాష్ కూడా పెట్టుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో, పుట్టినరోజు లాంటి సందర్భాలలో గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇది అద్భుతమైన ఆప్షన్.
ధర: రూ. 400
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్