దిస్పూర్ : ఈశాన్య భారతాన్ని భూకంపం వణికించింది. అసోంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూమి కంపించింది. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు.. 08.34 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. మొదట రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఉత్తర బెంగాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.
కూచ్ బెహార్, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే మేఘాలయలోనూ పలు ప్రాంతాలోనూ ప్రభావం కనిపించింది.భూపంక కేంద్రాన్ని తేజ్‌పూర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో భూపంక కేంద్రాన్ని గుర్తించినట్లు సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపంపై సీఎం సర్బానంద సోనావాల్‌స్పందించారు. అసోంలో భారీ భూకంపం వచ్చిందని, అందరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నట్లు చెప్పారు. భారీగా వచ్చిన ప్రకంపనలతో భవనాలు దెబ్బతిన్నాయి. ఫొటోలను హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా బిహార్‌లోనూ రాత్రి 2.29 గంటల సమయంలోనూ రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో బలమైన ప్రకంపనలు వచ్చాయి. కతిహార్, కిసాన్‌గంజ్, ఖడ్జియా ప్రాంతాల్లో భూమి కంపించగా.. రాగా.. ఎన్సీఎస్ ధ్రువీకరించలేదు.
Earthquake of Magnitude:6.4, Occurred on 28-04-2021, 07:51:25 IST, Lat: 26.69 & Long: 92.36, Depth: 17 Km ,Location: 43km W of Tezpur, Assam, India for more information download the BhooKamp App https://t.co/sayMF9Gumd pic.twitter.com/lWRDtIAWh5
— National Center for Seismology (@NCS_Earthquake) April 28, 2021
Few early pictures of damage in Guwahati. pic.twitter.com/lTIGwBKIPV
— Himanta Biswa Sarma (@himantabiswa) April 28, 2021
#WATCH Assam | Cracks appeared on a road in Sonitpur
— ANI (@ANI) April 28, 2021
as a 6.4 magnitude earthquake hit the region this morning. pic.twitter.com/WfP7xWGy2q