హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్వంలో సోమవారం ఔటర్ రింగురోడ్డు సమీపంలోని తొర్రూర్లో 59 ప్లాట్లకు వేలం నిర్వహించినట్టు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో ప్రభుత్వానికి రూ. 46 కోట్ల ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.
110 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొనగా, అత్యధిక ధర గజానికి రూ. 39వేలు పలికినట్టు పేర్కొన్నారు. ఇకడ ప్లాట్లకు కనీస ధర రూ. 25 (గజానికి)వేలుగా నిర్ధారించి వేలం నిర్వహించగా, సగటున గజానికి రూ. 28,700 చొప్పున ప్లాట్లు అమ్ముడుపోయినట్టు తెలిపారు. తొర్రూర్లో మిగిలిన 65 ప్లాట్లతోపాటు కుర్మల్పల్లిలో 25, బహదూర్పల్లిలో 13ప్లాట్లు కలిపి మొత్తం 104 ప్లాట్లకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహింనున్నట్టు ఆయన వెల్లడించారు.