ఢిల్లీ : టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తొలిరోజే నాలుగు పతకాలతో మెరువగా రెండో రోజూ 3 మెడల్స్ సాధించి సత్తాచాటారు. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో భారత అమ్మాయిలు.. అనుయా ప్రసాద్ స్వర్ణంతో మెరువగా ప్రంజలి ధుమాల్ రజతం నెగ్గాడు.
ఫైనల్లో 19 ఏండ్ల అనుయ.. 241.1 పాయింట్లు స్కోరు చేసి పసిడి గెలువగా ప్రంజలి.. 235.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో అభినవ్ దేశ్వాల్ (235.2) సిల్వర్ మెడల్ గెలిచాడు.