చేర్యాల, నవంబర్ 17: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంత్రి కొండా సురేఖను కోరారు. సచివాలయంలో జరిగిన రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు.
రూ. 12 కోట్లతో చేపట్టిన క్యూకాంప్లెక్స్, రూ.63 లక్షలతో నిర్మిస్తున్న ఢమరుకం, త్రిశూలం, రూ. 10.95 కోట్లతో నిర్మిస్తున్న 50 రూమ్ల పనులు పూర్తి చేయిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. అమ్మవార్లకు బంగారు కిరీటాలు తయారీ, తిమ్మారెడ్డిపల్లి నుంచి గుర్జకుంట వరకు బీటీ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే వినతిపత్రంలో పేర్కొన్నారు.