నదిలో మునిగిపోయిన 15 మంది.. ఆరుగురు గల్లంతు
నదిలో మునిగిపోయిన 15 మంది.. ఆరుగురు గల్లంతు | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికార వర్గాలు

లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం గుప్తార్ ఘాట్ వద్ద స్నానాలు చేస్తున్న క్రమంలో వారంతా నీటి మునిగిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంకా కుటుంబంలోని ఆరుగురి జాడ తెలియలేదని, వారి కోసం గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. రక్షించిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
వీరంతా ఆగ్రాలోని సికందారా ప్రాంతానికి చెందిన మహేశ్ కుమార్ కుటుంబమని.. అయోధ్య సందర్శన కోసం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుటుంబంలోని కొందరు కాళ్లు కడుక్కోగా.. మరికొందరు స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఇతర కుటుంబీకులు రక్షించేందుకు ప్రయత్నించినా వారు సైతం అందులో చిక్కుకుపోయారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్‌కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యోగాతో పీసీఓఎస్‌కు అడ్డుకట్ట
మధుమేహం..సరైన ఆహారం!
Covid-19 Vaccine : మూడో డోసు వేయనున్న ఫైజర్
బంగ్లాలో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 43 మంది దుర్మరణం
ఢిల్లీ విమానాశ్రయంలో రూ.కోటి విలువైన ఐఫోన్ల స్వాధీనం
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా.. 8 రోజుల జైలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

