మధుమేహం..సరైన ఆహారం!

డయాబెటిస్ రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది, కొవిడ్ బారినపడ్డ మధుమేహ రోగులు మరింత ఎరుకతో ఉండాలి. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..
- ఇంట్లోనే తరచూ బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి.
- తిన్న వెంటనే, సహజంగానే శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. కాబట్టి రోజూ ఒకే మోతాదులో ఆహారం తీసుకోవాలి. లేకపోతే, బ్లడ్ గ్లూకోజ్ స్థాయులపై ఆ ప్రభావం పడుతుంది.
- భోజనం నుంచి స్నాక్స్ వరకు అన్నిటినీ రోజూ ఒకే సమయానికి తీసుకోవాలి. రోజూ మూడు మేజర్ మీల్స్, ఐదు మైనర్ మీల్స్ తినాలి.
- ఫైబర్ డైట్‌ను అలవర్చుకోవాలి. ఉదాహరణకు ఓట్స్, వీట్ బ్రాన్, శనగపిండి, సోయా పదార్థాలు, చిరు
- ధాన్యాలు, ఆకుకూరలు, బ్రకోలీ, అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.
- తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులను అడగాలి. మద్యం, ధూమపానం సాధ్యమైనంత దూరం పెట్టాలి.
- ఆహారంలో దాల్చిన చెక్క, వెల్లుల్లి తరచూ వాడాలి. అందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.
వీటితో రోగ నిరోధక శక్తి..
- మెంతులు: ఒక టీ స్పూన్ మెంతులను అర కప్పు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగాలి.
- ఫైబర్ ఫుడ్: పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బీన్స్, బ్రకోలీ, పాలకూరలను రోజూ తీసుకోవాలి.
- పండ్లు : డయాబెటిక్ పేషెంట్లు తొక్కతోసహా తినగల పండ్లను ఎంచుకోవాలి. కారణం, తొక్కలో ఫైబర్ ఉంటుంది. అది పండ్లలోని కార్బొహైడ్రేట్లు చక్కెరగా మారే క్రమాన్ని నెమ్మదించేలా చేస్తుంది.
- నట్స్: బ్లడ్ షుగర్ నియంత్రణలో బాదంపప్పు తోడ్పడుతుంది.
- కడుపు మాడ్చొద్దు : అందరిలా రోజుకు మూడు పూటలు కాకుండా, తక్కువ మోతాదులోనైనా సరే ఏడెనిమిది సార్లు తినాలి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకూడదు.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
www.trudiet.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Diabetes
- food habits
- Sugar
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

