Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే మమతా బెనర్జీ బరిలోకి దిగిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం ఫలితంపై గందరగోళం నెలకొంది. మొదటి నుంచీ హోరాహోరీగా సాగిన ఈ ప్రక్రియలో మొదట 1200 ఓట్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee ) గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే నందిగ్రామ్‌లో గెలిచింది మమత కాదు సువేందు అధికారి అని పలు ఇంగ్లిష్ సైట్లు వార్తలు ప్రచురించాయి. మరోవైపు మమతా బెనర్జీ కూడా నందిగ్రామ్ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఫలితం ఏమైనా.. 221 స్థానాలు గెలిచాం.. బీజేపీ ఓడిపోయింది.. అది చాలు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాననీ ప్రకటించారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని, అప్పుడే పుకార్లు పుట్టించొద్దని ట్వీట్ చేయడం గమనార్హం. తృణమూల్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సువేందు అధికారి 1,736 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే
అన్నా మనమే గెలిచాం.. స్వీట్ తిను