Yumnam Khemchand Singh | మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణం.. రాష్ట్రపతి పాలన ఎత్తివేత
Yumnam Khemchand Singh | జాతుల వైరంతో అల్లాడిపోయిన మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన తొలగిపోయింది. కొత్త సీఎంగా యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా నెమ్చా కిప్జెన్, లోసియి దిఖో, హోంమంత్రి గోవిందాస్ కొంతౌజమ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇంఫాల్: జాతుల వైరంతో అల్లాడిపోయిన మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన తొలగిపోయింది. కొత్త సీఎంగా యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా నెమ్చా కిప్జెన్, లోసియి దిఖో, హోంమంత్రి గోవిందాస్ కొంతౌజమ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. (Yumnam Khemchand Singh) మణిపూర్‌లో అభివృద్ధిని తీసుకురావడానికి బీజేపీ జాతీయ నాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించిందని సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ తెలిపారు. తమ కొత్త ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తుందని చెప్పారు. 61 ఏళ్ల యుమ్నం ఖేమ్‌చంద్ మైతీ వర్గానికి చెందినవారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులైన నెమ్చా కిప్జెన్ కుకీ, లోసియి దిఖో నాగా తెగలకు చెందినవారు.
కాగా, మెజారిటీ మైతీ వర్గానికి ఎస్టీ హోదాను బీజేపీ ప్రభుత్వం కల్పించడాన్ని మైనారిటీలైన కుకీ, ఇతర తెగలు వ్యతిరేకించాయి. దీంతో మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. ఏడాదిపైగా కొనసాగిన హింసలో వందలాది మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రులయ్యారు.
మరోవైపు మైతీ వర్గానికి చెందిన నాటి సీఎం ఎన్ బీరెన్ సింగ్ కుకీలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు వీడియో వైరల్ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025 ఫిబ్రవరిలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఏడాది తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో బుధవారం ఉదయం రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది.
Also Read:
Car Tries To Run Over Man | నగ్నంగా మారి వ్యక్తి హంగామా.. అతడిపైకి కారు దూకించేందుకు యత్నం
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్‌లో దాచారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

