గురువారం 04 జూన్ 2020
National - May 20, 2020 , 12:10:43

నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?

నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌  స్టైరిన్‌ గ్యాస్‌‌ లీకేజీ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్జీ ప్లాంట్‌కు అనుమతులపై  విజయ సాయిరెడ్డి స్పందించారు. 

'అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లైనా ఎవరూ మర్చిపోలేదని' ఆయన తెలిపారు.

'చంద్రబాబు..ఎల్జీ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా అని అడిగారు. మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా?  నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?' అని విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు. 


logo