Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మైనారిటీ కుటుంబాలు (Muslim families) అత్యంత సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. హిందువులు (Hindu families) సురక్షితంగా ఉంటే.. ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని చెప్పారు. తానొక యోగినని.. మనుషులంతా సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని ఆయన వ్యాఖ్యానించారు.
‘ఉత్తరప్రదేశ్లో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారు. హిందువులు సురక్షితంగా ఉంటే.. వారు కూడా సురక్షితంగా ఉంటారు. 2017కి ముందు యూపీలో అల్లర్లు జరిగితే హిందూ దుకాణాలు కాలిపోతుండేవి. అప్పుడు ముస్లిం దుకాణాలు కూడా కాలిపోయేవి. హిందువుల ఇళ్లు కాలిపోతే.. ముస్లింల ఇళ్లు కూడా కాలిపోయేవి. కానీ, 2017 తర్వాత అంతా మారిపోయింది. ఒక యోగిగా నేను అందరి ఆనందం కోరుకుంటాను. బీజేపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు ఆగిపోయాయి. 100 హిందూ ఇళ్లు ఉన్న ఏరియాలో ఒక ముస్లిం కుటుంబం సురక్షితంగా ఉంటోంది. 100 ముస్లిం కుటుంబాలు ఉన్న ప్రాంతంలో ఒక్క హిందూ కుటుంబం, లేదా 50 హిందూ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయా..? లేదు కదా. ఇందుకు బంగ్లాదేశే ఓ ఉదాహరణ. పాకిస్థాన్ మరో ఉదాహరణ’ అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.
Also Read..
Bhupesh Baghel | భూపేశ్ బఘేల్ చుట్టూ కేసుల ఉచ్చు.. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సీబీఐ దాడులు
Etihad Airways | భారతీయులకు ఎతిహాద్ ఎయిర్వేస్ బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై 30% డిస్కౌంట్
Supreme Court | భారీగా చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే ఘోరం : సుప్రీంకోర్టు