ఇండోర్: కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిదిమేస్తున్నది. కరోనాతో అయినవారిని కోల్పోయిన కొందరు మనోవేదన భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఓ మహిళ తొమ్మిదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది.
ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా బాధపడుతూ ప్రాణాలొదిరాడు. దీంతో భర్త మరణాన్ని జీర్ణించుకోలేక పోయిన భార్య తొమ్మిందో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఎత్తైన భవనంపై నుంచి దూకడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు ఇండోర్ పోలీసులు తెలిపారు. భర్త మృతిని తట్టుకోలేకే ఆమె ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
Madhya Pradesh: A woman committed suicide in Indore following the death of her husband due to #COVID19
— ANI (@ANI) May 8, 2021
"She jumped off from ninth floor of a building & died on the spot. Probe revealed that she took this step after her husband succumbed to coronavirus," said police (08.05) pic.twitter.com/PBBMCQUhhH
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి