Viral Video | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో సదరు మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. మలప్పురం (Malappuram) జిల్లాలోని కొట్టక్కల్ (Kottakkal) ప్రాంతంలో గత నెల 26న ఈ ఘటన చోటు చేసుకుంది. స్వాగతమాడు గ్రామానికి చెందిన 33 ఏండ్ల బదారియా అనే మహిళ ఓ చిన్నారితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు మహిళను ఢీ కొట్టింది. అదే వేగంతో కారు ముందుకు దూసుకెళ్లింది.
దీంతో మహిళ మూడు మీటర్ల మేర గాల్లో ఎగిరి ఓ గోడను తాకి రోడ్డుపై పడిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ మహిళ పక్కన ఉన్న చిన్నారి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితురాలికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
#केरल के मलप्पुरम में तेज रफ्तार कार ने #महिला को मारी टक्कर.. हादसे में बच्चा बाल-बाल बचा.. हादसा CCTV कैमरे में हुआ रिकॉर्ड..#Kerala #Mallapuram pic.twitter.com/hMjop5d9VE
— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) May 2, 2025
Also Read..
Siddaramaiah | నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. ఏం చేయాలి..? : సీఎం సిద్ధరామయ్య
National Herald case | సోనియా, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు
Ghibli | శామ్ ఆల్ట్‌మన్, సత్య నాదెళ్ల జిబ్లీ ఫొటో చూశారా.. వైరలవుతున్న పిక్