Ghibli | సాంకేతికంగా ఏదైనా కొత్తది వచ్చిందంటే చాలు నెటిజన్లు దాన్ని అంత ఈజీగా వదలరు కద.. మొన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫొటోలను సృష్టించి వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జిబ్లీ వంతు వచ్చింది. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసినా జిబ్లీ (Ghibli) స్టైల్ ఇమేజ్లే దర్శనమిస్తున్నాయి.
చాట్‌జీపీటీలో ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమేజ్ జెనరేటర్ ‘జిబ్లీ’ స్టూడియో. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్.. ఇలా దేంట్లో చూసినా జిబ్లీ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. యూజర్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతరుల ఏఐ జనరేటెడ్ చిత్రాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella), ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman)కు సంబంధించిన జిబ్లీ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను శామ్ ఆల్టమన్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇటీవలే శామ్ ఆఫీస్‌కు సత్యనాదెళ్ల వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఫొటో దిగారు. ఆ ఫొటోను జిబ్లీ స్టైల్ చేసి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు కొత్త ఆఫీస్‌ను నాదెళ్లకు చూపించినట్లు తెలిపారు. దీనికి సత్యనాదెళ్ల స్పందించారు. కొత్త ఆఫీస్ నచ్చిందంటూ బదులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
fun showing @satyanadella our new office and talking about some of our latest progress! pic.twitter.com/p2BGB0So7M
— Sam Altman (@sama) May 1, 2025
Also Read..
Terror Attack | పెహల్గామ్ దాడి వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం.. ఎన్ఐఏ వర్గాల సమాచారం
medical students suicide | ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థుల ఆత్మహత్య.. 1,116 మంది డ్రాపవుట్
Crime news | ఆర్టీసీ బస్సులో మహిళను అసభ్యంగా తాకి.. ఎదురుతిరగడంతో..!