Crime news : ఆర్టీసీ బస్సు (RTC Bus) లో సాటి మహిళపట్ల ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కర్ణాటక (Karnataka) ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం బాధితురాలు తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఘటనకు సంబంధించి సదరు మహిళ తన పోస్టులో ఏం చెప్పారంటే.. ‘నేను ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా నా వెనుక ఉన్న వ్యక్తి నన్ను అసభ్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది పసిగట్టిన నేను పట్టుకుని నిలదీయడంతో తాను ఆ పని చేయలేదని బుకాయించాడు. పైగా ‘ఇప్పుడు నీకేం కాలేదుగా.. బాగానే ఉన్నావుగా..’ అని దబాయించాడు. వీళ్లు పొటెన్షియల్ రేపిస్టులు. ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు’ అని పేర్కొన్నారు.
This guy in the bus tried sneaking his hand from back, when I caught him, he denied & later told that “nothing happened to you right, you were fine” these are potential rapist, imagine if they can do this in crowded bus what their potential is, this country is not safe for women. https://t.co/xXbolJ8jyF pic.twitter.com/XOjKzhcYO8
— Walsssss (id/iot) (@repsaccore) May 1, 2025
అంతేగాక తాను ఇకపై ఎప్పుడూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించబోనని మరో పోస్టులో బాధితురాలు రాసుకొచ్చారు. ఆమె పోస్టుపై కర్ణాటక ఆర్టీసీ స్పందించింది. నిందితుడిని వెతికి పట్టుకునేందుకు టికెట్ వివరాలను సమకూర్చాలని బాధితురాలు కోరింది. దాంతో ఆమె టికెట్ వివరాలను కర్ణాటక ఆర్టీసీకి షేర్ చేసింది. అయితే నిందితుడిని ట్రేస్ చేశారా.. లేదా.. అనే విషయాన్ని ఆర్టీసీ ఇంతవరకు వెల్లడించలేదు.