National Herald case | నేషనల్ హెరాల్డ్ (National Herald)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వేసిన పిటిషన్పై ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ పత్రాలను పరిశీలించిన కోర్టు.. ఈ మేరకు నిర్ణయం వెలువరించింది.
కాగా, ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వేసిన పిటిషన్పై గత వారం ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. అయితే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. చార్జిషీట్లో సరైన పత్రాలు లేవని, ఆ పత్రాలను దాఖలు చేయాలని ఈడీ అధికారులను కోర్టు ఆదేశించింది. ఆ పత్రాలను పరిశీలించిన అనంతరం నోటీసుల జారీపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ కోర్టు తెలిపింది. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది.
Also Read..
Terror Attack | పెహల్గామ్ దాడి వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం.. ఎన్ఐఏ వర్గాల సమాచారం
Bilawal Bhutto | ఉగ్రవాద సంస్థలతో పాక్ సంబంధాలు నిజమే : బిలావల్ భుట్టో
Worlds Oldest Person | ప్రపంచంలోనే అత్యంత వృద్ధమహిళ కన్నుమూత