Worlds Oldest Person | ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా (worlds oldest person) పేరొందిన సిస్టర్ ఇనా కనబారో లుకాస్ (Sister Inah Canabarro Lucas) తాజాగా కన్నుమూశారు. బ్రెజిల్ (Brazil)కు చెందిన ఆమె 116 ఏళ్ల వయసులో గురువారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. 117వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ఆమె మరణించినట్లు తెలిపారు.
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండ్ దు సుల్ రాష్ట్రంలో 1908, మే 27న లుకాస్ జన్మించారు. తన 20వ ఏట కేథలిక్ నన్ (సన్యాసిని)గా మారారు. వృద్ధాప్య సమస్యల కారణంగా కాసెరోస్‌లోని శాంటా కాసా డి మిసెరికార్డియా ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనబారో లుకాస్‌కు ఫుట్‌బాల్ క్రీడ అంటే చాలా ఇష్టం. శతాధిక వయసులోనూ ఆమె ఆ క్రీడ పట్ల ఆసక్తి చూపేవారు.
దీంతోకుటుంబ సభ్యులు కనబారో లుకాస్ పుట్టినరోజును స్పోర్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ స్టేడియం, పోర్టో అలెగ్రే ఫుట్‌బాల్ టీమ్ థీమ్ కేక్‌తో సెలబ్రేట్ చేసేవారు. కనబారో లుకాస్ మరణవార్త తెలుసుకున్న పలువురు సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Attari – Wagah border | వాఘా సరిహద్దును తిరిగి తెరిచిన పాకిస్థాన్
Nepali Student | కీట్ వర్సిటీలో మరో నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య.. 90 రోజుల్లో రెండో ఘటన
Cyber Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో 10 లక్షల సైబర్ దాడులు