Attari – Wagah border | వాఘా సరిహద్దును తిరిగి తెరిచిన పాకిస్థాన్
Attari - Wagah border | అట్టారీ- వాఘా బార్డర్ (Attari - Wagah border)ను పాకిస్థాన్ తిరిగి తెరిచింది.
Attari – Wagah border | అట్టారీ- వాఘా బార్డర్ (Attari – Wagah border)ను పాకిస్థాన్ తిరిగి తెరిచింది. భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు (Pak Citizens) స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం ఓపెన్ చేసింది. దీంతో బార్డర్లో చిక్కుకుపోయిన చాలా మంది పాక్ జాతీయులు ఇవాళ ఉదయం తమ దేశంలోకి అడుగుపెట్టారు.
పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తాత్కాలిక వీసాపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ రెండు దేశాలూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి డెడ్‌లైన్ కూడా విధించాయి. ఆ గడువు ముగియడంతో పాకిస్థాన్ గురువారం ఉదయం 8 గంటలకు సరిహద్దును మూసివేసింది. ఈ సరిహద్దు వద్ద పాకిస్థాన్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వేచి చూస్తుండగానే కౌంటర్లను మూసివేసింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. దీంతో డజన్ల కొద్దీ పాక్ పౌరులు ఆ సరిహద్దు వద్దనే నిలిచిపోయారు.
దీంతో తాము అసలు ఏ దేశానికి చెందిన వారిమో తెలియక మహిళలు, వృద్ధులు, పిల్లలు తలదాచుకునే ప్రదేశం కూడా లేక, ఆకలితో అల్లాడారు. పాకిస్థాన్ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తమ సొంత పౌరులను దేశంలోకి రానీయకపోవడమేమిటని మండిపడుతున్నారు. అయితే పాకిస్థాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దును పాక్ తెరిచి.. తమ పౌరులను స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పించింది.
Also Read..
Air India | పాక్ ఆంక్షలు.. ఎయిర్ ఇండియాకు రూ.వేల కోట్ల నష్టం..!
JD Vance | ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలి.. పాక్‌కు జేడీ వాన్స్ సూచన
Cyber Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో 10 లక్షల సైబర్ దాడులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

