JD Vance | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తాజాగా స్పందించారు. దాడి తర్వాత విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయకుండా భారత్ స్పందన ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడటంలో ఆ దేశం భారత్‌కు సహకరించాలని కోరారు.
కాగా, జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ దాడి గురించి ఆయన స్పందించారు. పర్యాటకులపై దాడి దిగ్భ్రాంతికర విషయమన్నారు. ఈ దాడిపై భారత్ ప్రతిస్పందించడం సరైనదేనని వ్యాఖ్యానించారు. అయితే, విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా భారత్ స్పందన ఉంటుందని విశ్విస్తున్నట్లు చెప్పారు. ఇక పాకిస్థాన్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలని సూచించారు.
మరోవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీ వద్ద పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. వరుసగా ఎనిమిదో రోజు రాత్రి ఎల్వోసీ వెంబడి కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, నౌషెరా, ఆఖ్నూర్ సెక్టార్లలో రాత్రివేళ చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం ఇందుకు దీటుగా స్పందించిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
Also Read..
Pak Army | సరిహద్దుల్లో ఉద్రిక్తత.. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు
CIA | భారత్ అంటే పాక్‌కు భయమే.. యుద్ధం చేసే దమ్ము ఆ దేశానికి లేదు: సీఐఏ
Pahalgam Attack | దక్షిణ కశ్మీర్‌లోనే పహల్గాం ఉగ్రవాదులు